భారతదేశం, ఫిబ్రవరి 4 -- Jagityal Accident: జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్సై మృతి చెందారు. ద్విచక్ర వాహనాన్ని తప్పించే క్రమంలో ఎస్సై నడుపుతున్న కారు చెట్టును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మహిళా ఎస్ ఐ శ్వేతతో పాటు మరొకరు మృతి చెందారు.
గొల్లపల్లి మండలం చిల్వకోడూర్ వద్ద మంగళవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. కారు నడుపుతున్న 2020 బ్యాచ్ కి చెందిన ఎస్ఐ శ్వేతతో పాటు బైక్ మీద ప్రయాణిస్తున్న వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయారు. గతంలో వెల్గటూర్, కోరుట్ల, పెగడపల్లి, కథలాపూర్ స్టేషన్లలో శ్వేత ఎస్సైగా విధులు నిర్వర్తించారు.
ఇటీవల కోరుట్ల నుంచి జగిత్యాల డిసిఆర్బీకి బదిలీ అయ్యారు. సోమవారం రాత్రి స్వగ్రామం చొప్పదండి మండలం ఆర్నకొండకు వచ్చి ఉదయం జగిత్యాలకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. బైకును తప్పించబోయే క్రమంలో చెట్టును బలంగా ఢీ క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.