Hyderabad, ఏప్రిల్ 6 -- షుగర్ రీప్లేస్మెంట్ కోసం మనలో చాలా మంది వాడే పదార్థం బెల్లం. అవును, రుచిలో చక్కెరకు ధీటుగా తియ్యదనం అందించడమే కాకుండా ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేసే లక్షణాలు ఇందులో ఉంటాయి. ఇలా రుచి కోసం వినియోగించే బెల్లాన్ని చర్మ సౌందర్యం కోసం కూడా ఉపయోగించవచ్చట. ముఖ్యంగా ఈ వేసవిలో సూర్యరశ్మి వల్ల ట్యానింగ్‌కు గురైన చర్మం కాంతివంతంగా మెరిసిపోవాలన్నా లేదా చర్మంపై మచ్చలు పోవాలన్నా బెల్లం ప్రయోజనకరంగా ఉంటుంది. చర్మం కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడి వయస్సు పెరిగే లక్షణాలను నెమ్మెది అయ్యేలా చేస్తుంది. ఇంకా బెల్లంలో ఉండే సహజమైన తీపి గుణం ప్రత్యేకమైన మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు అయిన ఐరన్, కాల్షియం, విటమిన్ సీలతో నిండి ఉంటుంది.

చర్మానికి సపోర్ట్ చేసే ఐరన్, కాల్షియం, విటమిన్ సీలు బెల్లంలో పుష్కలంగా ఉంటాయి. చర్మారోగ్య...