Hyderabad, మార్చి 17 -- బెల్లం లేదా పంచదారలో ఏది ఆరోగ్యానికి మంచిదో అందరికీ తెలిసిందే. పంచదారకు బదులు బెల్లాన్ని వాడమని వైద్యులు కూడా సూచిస్తారు. బెల్లాన్ని ముడి చక్కెరగా చెప్పుకోవచ్చు. అంటే ఎలాంటి ప్రాసెస్ చేయని పంచదార రూపమే బెల్లం. అందుకే పంచదారకు బదులు బెల్లాన్ని తినమని చెబుతారు. దీంట్లో ఇనుము కంటెంట్ కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే బెల్లం తినడం వల్ల కూడా మూత్రపిండాలు దెబ్బతింటాయని అంటారు. దీనికి కారణం ఏంటో తెలుసుకోండి.

పంచదారకు ప్రత్యామ్నాయంగా పరిగణించే బెల్లంలో ఇనుము, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇది జీర్ణ క్రియకు ఎంతో సహాయపడుతుంది. రక్తహీనత సమస్య నుంచి మనల్ని రక్షిస్తుంది. తిన్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వంటి సమస్యలు ఉండవు. స్థిరంగా శక్తి విడుదల జరుగుతుంది. కాబట్టి క్రమం తప్...