Hyderabad, ఫిబ్రవరి 22 -- బెల్లం వాడకం తెలుగిళ్లల్లో అధికంగానే ఉంటుంది. దీన్ని చెరకు లేదా తాటి రసాలతో తయారుచేస్తారు. ఇది సహజ తీపి పదార్థం. దీనిలో పోషకాలు అధికంగా ఉంటాయి. బెల్లం శుధ్దంగా ఉంటేనే అది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ ఇప్పుడు కల్తీ బెల్లం మార్కెట్లోకి వస్తోంది. దీన్ని తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది.

బెల్లంలో రసాయనాలు లేదా కృత్రిమ రంగుల మిశ్రమాన్ని కలిపి అమ్ముతున్నారు. కాబట్టి, బెల్లం శుద్ధతను పరీక్షించడం చాలా ముఖ్యం. ఈ పనిని చాలా సులభమైన కొన్ని పద్ధతుల ద్వారా ఇంట్లోనే చేయవచ్చు. బెల్లం శుద్ధతను ఎలా పరీక్షించాలో ఇక్కడ తెలుసుకోండి.

కృత్రిమ రంగు పరీక్ష: బెల్లం రంగును గమనించండి. సహజంగా శుద్ధమైన బెల్లం గోధుమ లేదా బంగారు పసుపు రంగులో ఉంటుంది. బెల్లం మెరుస్తూ ఉంటే దానిలో కృత్రిమ రంగు మిశ్రమం ఉందని అర్థం చేసుకోండి. దీన్ని పరీ...