భారతదేశం, ఏప్రిల్ 8 -- ఏపీ పోలీసులకు వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఎల్లకాలం చంద్రబాబు పాలన కొనసాగదన్న జగన్.. చంద్రబాబుకు ఊడిగం చేసే వారికి శిక్ష తప్పదని స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యూనిఫామ్‌ తీయించి చట్టం ముందు నిలబెడతాం.. ఉద్యోగాలు లేకుండా చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.

'రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దిగజారిపోయింది. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. హింసను ప్రోత్సహిస్తున్నారు. బలం లేకున్నా ఎన్నికలు నెగ్గాలని.. దిగజారుడు రాజకీయం చేస్తున్నారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా చేయొచ్చా. అధికారంలో ఉంటే అన్ని పదవులు వారికే కావాలి అన్నట్టు దౌర్జన్యం చేస్తున్నారు. పోలీసులను వాచ్‌మెన్‌లగా హీనంగా వాడుకుంటున్నారు' అని జగన్ ఆరోపించారు.

'రామగిరి మండలంలో వైసీపీ తరఫున 9 ...