భారతదేశం, ఫిబ్రవరి 6 -- వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి 2019లో ఎవరూ ఊహించని విజయం సాధించారు. ఏకంగా 151 నియోజకవర్గాల్లో తన పార్టీ అభ్యర్థులను గెలిపించుకున్నారు. ఈ స్థాయిలో విజయం రావడానికి అనేక కారణాలు ఉండొచ్చు. కానీ.. ముఖ్యంగా అప్పటి ప్రభుత్వంపై వ్యతిరేకత, జగన్, వైఎస్సార్ ఇమేజ్, టీడీపీ, జనసేన, బీజేపీ విడివిడిగా పోటీ చేయడం అని రాజకీయ విశ్లేషకులు చెబుతారు. ఈ అన్ని కారణాల కంటే.. జగన్ కోసం ప్రతీ కార్యకర్త ప్రాణం పెట్టి పనిచేశాడు.

జగన్ విజయంలో అత్యంత కీలక పాత్ర పోషించిన కార్యకర్తలు.. మొదటి సంవత్సరం బాగానే ఉన్నారు. ఆ తర్వాతే అసలు సమస్యలు మొదలయ్యాయి. జగన్ ఎప్పుడైతే వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టారో.. అప్పటినుంచి కేడర్‌లో అసంతృప్తి మొదలైంది. మధ్యవర్తిత్వం లేకుండా నేరుగా ప్రజలకు పథకాలు వెళ్లాలని జగన్ మంచిగానే ఆలోచించారు. అదే కార్యకర్తలకు నచ్చలేదు. వాలంటీర...