భారతదేశం, జనవరి 30 -- Jackpot to Employees: కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు సంవత్సరం చివరలో బోనస్ లు ఇస్తుంటాయి. అయితే, చైనాకు చెందిన ఈ కంపెనీ తన ఉద్యోగులకు వినూత్నంగా బోనస్ ను అందించాలని భావించింది. ఉద్యోగుల కోసం ఒక పార్టీని ఏర్పాటు చేసింది. బోనస్ డబ్బును పొందడానికి ఉద్యోగుల మధ్య ఒక ఆసక్తికర పోటీని ఏర్పాటు చేసింది.

చైనాకు చెందిన హెనన్ మైనింగ్ క్రేన్ కంపెనీ యాజమాన్యం 11 మిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన నగదును ఒక టేబుల్ పై ఉంచింది. 15 నిమిషాల్లో ఉద్యోగులు "వారు కోరుకున్నంత నగదును లెక్కించి తీసుకోవచ్చని" ఉద్యోగులకు తెలిపింది. దాంతో, ఉద్యోగులు ఆ టేబుల్ పై ఉన్న నగదులో నుంచి సాధ్యమైనంత ఎక్కువ మొత్తాన్ని లెక్కించి తీసుకోవడానికి శాయశక్తులా కృషి చేశారు.

ఉద్యోగులు టేబుల్ పై ఉన్న నగదును లెక్కించి తీసుకుంటుండగా తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మా...