భారతదేశం, ఏప్రిల్ 10 -- సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌, వైష్ణ‌వి చైత‌న్య జంట‌గా న‌టించిన జాక్ మూవీ ఏప్రిల్ 10న (నేడు) ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. స్పై యాక్ష‌న్ కామెడీగా తెర‌కెక్కిన ఈ మూవీకి బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ సినిమా ఓవ‌ర్‌సీస్ ప్రీమియ‌ర్స్ టాక్ ఎలా ఉందంటే?

జాక్ మూవీ ఓవ‌ర్‌సీస్ ప్రీమియ‌ర్స్‌కు నెగెటివ్ టాక్ వినిపిస్తోంది. ఈ మూవీలో స్పై యాక్ష‌న్ అంశాలు థ్రిల్‌ను పంచ‌లేద‌ని, కామెడీ అస్స‌లు వ‌ర్క‌వుట్ కాలేద‌ని చెబుతోన్నారు. ఫ్యామిలీ, ల‌వ్‌స్టోరీ సినిమాల ద‌ర్శ‌కుడిగా ముద్ర‌ప‌డిన బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ఈ సారి త‌న జోన‌ర్ మార్చి జాక్ మూవీని తెర‌కెక్కించాడు. కానీ అత‌డి ప్ర‌య‌త్నం మాత్రం పూర్తిగా బెడిసికొట్టింద‌ని నెటిజ‌న్లు ట్వీట్స్ చేస్తున్నారు. జాక్ మూవీ కోసం బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ రాసుకున్న క‌థ వీక్‌గా ఉంద‌ని, స్క్రీన్‌ప్లే క...