భారతదేశం, మార్చి 7 -- 'డీజే టిల్లు' అంటూ వరుస హిట్లతో జోరుమీదున్న స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ మరో కొత్త సినిమా తో ఫ్యాన్స్ ఎంటర్ టైన్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సారి టైటిల్ తోనే వైబ్స్ క్రియేట్ చేస్తున్నాడు. 'జాక్-కొంచెం క్రాక్' అంటూ ఫ్యాన్స్ ను హుషారెత్తించేందుకు మరోసారి థియేటర్లోకి వస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజైంది.

స్పానిష్ కవి

'జాక్-కొంచెం క్రాక్' మూవీ నుంచి రిలీజైన ఫస్ట్ లిరికల్ సాంగ్ 'పాబ్లో నెరుడా' పవర్ ఫుల్ లైన్స్ తో సాగుతోంది. స్పానిష్ కవి అయిన పాబ్లో నెరుడా పేరుతో ఈ సాంగ్ క్యాచీగా ఉంది. హీరోను ఎలివేట్ చేసేలా పాటను రూపొందించారు. ఈ లిరికల్ వీడియోలో సిద్ధు హుషారైన స్టెప్స్ వేశాడు. జానీ మాస్టర్ ఈ సాంగ్ కొరియోగ్రాఫ్ చేశారు. ఈ పాటకు వనమాలి లిరిక్స్ రాశారు.

స్టైలిష్ లుక్స్

'డీజే టిల్లు', 'టిల్లు ...