భారతదేశం, మార్చి 20 -- స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య హీరోహీయిన్లుగా జాక్ చిత్రం వస్తోంది. ఈ మూవీకి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రొమాంటిక్ డ్రామా చిత్రంపై మంచి హైప్ ఉంది. టిల్లు స్క్వేర్ మూవీతో ఈ ఏడాది భారీ హిట్ కొట్టారు సిద్ధు. బేబీ చిత్రంతో పాపులర్ అయ్యారు వైష్ణవి. వీరిద్దరూ జంటగా నటిస్తుంటంతో చాలా క్రేజ్ ఉంది. జాక్ సినిమా నుంచి నేడు (మార్చి 20) రెండో సాంగ్ రిలీజైంది.

జాక్ చిత్రం నుంచి కిస్ సాంగ్ అంటూ ఈ రెండో పాట వచ్చేసింది. లిరికల్ వీడియో రిలీజ్ అయింది. ముద్దు పెట్టుకునేందుకు ప్లేస్ కోసం వెతికే థీమ్‍తో ఈ పాట సాగుతుంది. ఎక్కడికి వెళ్లినా డిస్ట్రబెన్స్ ఉంటుంది. సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి మధ్య కెమిస్ట్రీ ఈ పాటలో ఆకట్టుకునేలా ఉంది.

ఈ కిస్ పాటకు మంచి మెలోడియస్ ట్యూన్ ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ సురేశ్ బొబ్బ...