భారతదేశం, ఏప్రిల్ 11 -- Jack Day 1 Collections: సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ జాక్ మూవీ ఫ‌స్ట్‌డేనే బాక్సాఫీస్ వ‌ద్ద తేలిపోయింది. ప్రీమియ‌ర్స్ నుంచే ఈ సినిమాకు దారుణంగా నెగెటివ్ టాక్ రావ‌డంతో ఆ ప్ర‌భావం క‌లెక్ష‌న్స్‌పై గ‌ట్టిగానే ప‌డింది. ఈ స్పై యాక్ష‌న్ కామెడీ మూవీ ఫ‌స్ట్ డే వ‌ర‌ల్డ్ వైడ్‌గా రెండున్న‌ర కోట్ల లోపే వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కోటిన్న‌ర వ‌ర‌కు వ‌సూళ్ల‌ను ద‌క్కించుకోగా...ఓవ‌ర్‌సీస్‌లో మ‌రో కోటి వ‌ర‌కు క‌లెక్ష‌న్స్ వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.

జాక్ కంటే ముందు సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ హీరోగా న‌టించిన టిల్లు స్క్వేర్ మూవీ తొలిరోజు 23.70 కోట్ల వ‌ర‌కు క‌లెక్ష‌న్స్ సొంతం చేసుకొని రికార్డ్ క్రియేట్ చేసింది. టిల్లు స్క్వేర్‌లో స‌గంలో స‌గం కూడా జాక్ క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకోలేక డీలా ప‌డింది. రెండో రోజు జా...