భారతదేశం, ఫిబ్రవరి 1 -- Jabardasth Comedian: జ‌బ‌ర్ధ‌స్థ్ క‌మెడియ‌న్ రాం ప్ర‌సాద్ హీరోగా ఎంట్రీ ఇస్తోన్నాడు. వైఫ్ ఆఫ్ అనిర్వేష్ పేరుతో ఓ మూవీ చేస్తోన్నాడు. సస్పెన్స్ థ్రిల్లర్ క‌థాంశంతో తెర‌కెక్కుతోన్న వైఫ్ ఆఫ్ అనిర్వేష్ మూవీ ఫ‌స్ట్ లుక్‌ను మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఆర్‌పీ ప‌ట్నాయ‌క్ రిలీజ్ చేశాడు. ఈ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌లో రామ్ ప్ర‌సాద్‌తో పాటు ప‌లువురు యాక్ట‌ర్లు క‌నిపిస్తోన్నారు. కేబుల్ బ్రిడ్జ్, హుస్సేన్ సాగ‌ర్‌తో పాటు హైద‌రాబాద్ సిటీ... పోస్ట‌ర్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో క‌నిపిస్తోంది. ఓ జంట పార్టీ చేసుకుంటున్న‌ట్లుగా చూపించారు. పోస్ట‌ర్‌పై ఉన్న హి విల్ కిల్ యూ అనే ఆక్ష‌రాలు ఆస‌క్తిని పంచుతోన్నాయి.

వైఫ్ ఆఫ్ అనిర్వేష్ మూవీకి గంగ స‌ప్త శిఖర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. వెంకటేశ్వర్లు మెరుగు, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మిస్తున్నారు. ఈ మూవీలో రాంప్రసాద్...