Hyderabad, ఫిబ్రవరి 21 -- Jabardasth Abhi The Devils Chair Movie: సినీ ఇండస్ట్రీలో ఒక పాపులారిటీ తెచ్చుకున్న సెలబ్రిటీలు కొత్త రోల్స్‌తో అలరిస్తుంటారు. అలా ఎంతోమంది డైరెక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ హీరోలుగా మారారు. కమెడియన్స్ దర్శకులుగా మారి మంచి సినిమాలు చేశారు. ఇలానే తాజాగా జబర్దస్త్ కమెడియన్ అదిరే అభి హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు.

జబర్దస్త్ కామెడీ షోలో అదిరే అభిగా తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్ తెచ్చుకున్న అభినయ కృష్ణ హారర్ మూవీతో టాలీవుడ్‌లో హీరోగా పరిచయం కానున్నాడు. ప్రభాస్ ఈశ్వర్ వంటి పలు సినిమాల్లో నటుడిగా ఎప్పుడో ఎంట్రీ ఇచ్చిన అదిరే అభి ఇప్పుడు హీరోగా అలరించనున్నాడు. అదిరే అభి హీరోగా నటించిన హారర్ సినిమా ది డెవిల్స్ చైర్. ఈ సినిమాతో గంగ సప్తశిఖర అనే యంగ్ డైరెక్టర్ పరిచయం కానున్నారు.

అయితే, సాధారణంగా తొలి సినిమా అంటే సేఫ్‌ జోన్‌లో ఉండ...