భారతదేశం, మార్చి 2 -- Jabardast Ramprasad: జ‌బ‌ర్ధ‌స్థ్ క‌మెడియ‌న్ ఆటో రాంప్ర‌సాద్ హీరోగా ఎంట్రీ ఇస్తోన్నాడు. వైఫ్ ఆఫ్ అనిర్వేష్ పేరుతో ఓ మూవీ చేస్తోన్నాడు. క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కుతోన్న ఈ మూవీ ట్రైల‌ర్‌ను బిగ్‌బాస్ ఫేమ్‌, హీరో శివాజీ రిలీజ్ చేశాడు. బీచ్‌లో ఓ డెడ్‌బాడీ దొరికిన‌ట్లు పోలీసుల‌కు ఇన్ఫ‌ర్మేష‌న్ అందే సీన్‌తో ట్రైల‌ర్ ఇంట్రెస్టింగ్‌గా ప్రారంభ‌మైంది. భ‌ర్త వ‌ల్ల సుఖం లేద‌ని అత‌డిని త‌న ప్రియుడితో క‌లిసి చంపాల‌ని ఓ భార్య ప్ర‌య‌త్నించ‌డం, ఓ హ‌త్య కేసును పోలీసులు ఇన్వేస్టిగేష‌న్ చేసే అంశాల‌తో ఈ ట్రైల‌ర్ సాగింది. ఈ మూవీలో జ‌బ‌ర్ధ‌స్థ్ రాంప్ర‌సాద్ సీరియ‌స్ రోల్‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు ట్రైల‌ర్ చూస్తుంటే తెలుస్తోంది.

ట్రైల‌ర్‌ను లాంఛ్ చేసిన అనంత‌రం శివాజీ మాట్లాడుతూ ట్రైల‌ర్‌లో రాంప్ర‌సాద్ క్యారెక్ట‌ర్ డిఫ‌రెంట్ వేరియేష...