భారతదేశం, ఫిబ్రవరి 11 -- Jabalpur Accident: కుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తున్న టూరిస్ట్‌ బస్సును భారీ ట్రక్కు ఢీకొట్టడంతో హైదరాబాద్‌కు చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో మంగళవారం ఉదయం 9.15కు ఈ ప్రమాదం జరిగింది. 30వ నంబరు జాతీయ రహదారిపై సిహోరా వద్ద వంతెనపై ఎదురెదురుగా ఢీకొనడంతో టెంపో ట్రావెలర్ బస్సు నుజ్జయ్యింది. ట్రావెల్ బస్సులో ప్రయాగరాజ్‌ వెళ్లి తిరిగి వస్తుండగా జబల్‌పూర్‌ సమీపంలో ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన స్థలానికి జబల్‌పూర్‌ ఎస్పీ, కలెక్టర్ చేరుకున్నారు.

మృతి చెందిన వారిని హైదరాబాద్‌కు చెందిన వారిగా గుర్తించారు. నాచారం రాఘవేంద్ర నగర్ నుంచి కుంభమేళాకు వెళ్లిన వారిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మినీ బస్సు రిజిస్ట్రేషన్‌ ఆధారంగా మృతులను ఏపీకి చెందిన వారిగా భావించారు. ట్రావెల్స్‌ వాహనం నంబర్‌ ఏపీ ...