భారతదేశం, ఏప్రిల్ 10 -- Jaat Twitter Review: స‌న్నీడియోల్ హీరోగా తెలుగు డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన బాలీవుడ్ మూవీ జాట్ ఏప్రిల్ 10న (నేడు) థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేక‌ర్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. రెజీనా, స‌యామీఖేర్‌, ర‌మ్య‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. ఈ బాలీవుడ్ మూవీ ప్రీమియ‌ర్స్ టాక్ ఏంటంటే?

జాట్ ... టిఫిక‌ల్ సౌత్ మాస్ మ‌సాలా యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ అని బాలీవుడ్ ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తోన్నారు. ఎమోష‌న్స్‌, క‌థ కంటే యాక్ష‌న్‌, ఎలివేష‌న్ల‌ను న‌మ్ముకొనే ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేని ఈ సినిమాను తెర‌కెక్కించాడంటూ కామెంట్స్ చేస్తోన్నారు. యాక్ష‌న్ సీక్వెన్స్‌లు మాత్రం గూస్‌బంప్స్‌ను క‌లిగిస్తాయ‌ని అంటున్నారు.

ఫైట్స్ ఈ మూవీకి ప్ల‌స్‌తో...