Hyderabad, ఫిబ్రవరి 17 -- Jaali Reddy Wedding: పుష్ప మూవీలో జాలి రెడ్డి పాత్ర పోషించిన నటుడు గుర్తున్నాడు కదా. ఆ సినిమాలో ఎంతో క్రూరమైన, అమ్మాయిలను వేధించే పాత్రలో కనిపించిన ఈ నటుడి పేరు ధనంజయ. ఈ కన్నడ నటుడు రియల్ లైఫ్ లో మాత్రం అమ్మాయిలను ఎంతో గౌరవించే వాడని తాజాగా వైరల్ అవుతున్న వీడియో చూస్తే స్ఫష్టమవుతోంది.

కన్నడ నటుడు ధనంజయ ఈ మధ్యే పెళ్లి చేసుకున్న విషయం తెలుసు కదా. డాక్టర్ అయిన ధన్యంత గౌరక్లర్ ను మైసూరులో ఫిబ్రవరి 15న అతడు పెళ్లి చేసుకున్నాడు. వీళ్ల పెళ్లి కొందరు సన్నిహితుల సమక్షంలోనే జరిగింది. రెండు రోజులుగా ధనంజయ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

అయితే తాజాగా అతనికి సంబంధించిన ఓ వీడియో మాత్రం బాగా వైరల్ అవుతోంది. అందులో ధనంజయ తన భార్య ధన్యంత కాళ్లు మొక్కడం విశేషం. పెళ్లి తర్వాత తన కాళ్లు మొక్కడానికి భార్య ప్...