Hyderabad, ఏప్రిల్ 3 -- వేసవి కాలంలో మార్కెట్లో ఎక్కువగా దొరికే కూరగాయల్లో దొండకాయ ఒకటి. అవి రుచిలో మాత్రమే కాదు ఆరోగ్యపరంగా కూడా చాలా మంచివి. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, కాల్షియం వంటి పోషకాల ఉండటం వల్ల వీటిని తినడం చాలా రకాలుగా మేలు చేస్తుంది. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అనేక ఆరోగ్య సమస్యలను నయం చేస్తాయి. ముఖ్యంగా వేసవిలో దొండకాయ తినడం వల్ల డీహైడ్రేషన్ సమస్య నుంచి తప్పించుకోవచ్చు. రోజూ రెండు పచ్చి దొండకాయలను తినడం లేదంటే వారంలో ఒకటి రెండు సార్లు దొండకాయ కూరను తినడం వల్ల చాలా రకాల ప్రయోజనాలను పొందచ్చు. వాటిలో ముఖ్యమైన కొన్నింటి గురించి తెలుసుకుందాం రండి.

దొండకాయ సహజ చల్లదన లక్షణాలు కలిగి ఉంటుంది. ఇది వేసవిలో వేడెక్కిన శరీరాన్ని చల్లబరచుతుంది. అంతేకాదు వేడి కారణంగా వచ్చే తలనొప్పి, బలహీనత, దాహాన్ని తగ్గిం...