భారతదేశం, సెప్టెంబర్ 13 -- మరో రెండు రోజుల్లో ఐటీఆర్​ ఫైలింగ్​ గడువు ముగియనుంది. పన్ను చెల్లింపుదారులు సెప్టెంబర్ 15వ తేదీలోపు తమ ఆదాయపు పన్ను రిటర్న్‌ (ఐటీఆర్)లను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ గడువు తేదీని దాటితే ఏం జరుగుతుందనే ప్రశ్న చాలా మందికి వస్తుంది. ఐటీఆర్ ఫైల్ చేయడంలో విఫలమైతే, ఆదాయపు పన్ను శాఖ ఆలస్యంగా రిటర్న్స్ సమర్పించడానికి అవకాశం ఇస్తుంది, కానీ అందుకు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.

గడువు తేదీ మిస్ అయితే, పన్ను చెల్లింపుదారులు డిసెంబర్ 31వ తేదీలోపు బిలేటెడ్ రిటర్న్‌లను ఫైల్ చేయవచ్చు. అసెస్‌మెంట్ ఇయర్ 2025-26కి, బిలేటెడ్ రిటర్న్ దాఖలు చేయడానికి చివరి తేదీ డిసెంబర్ 31, 2025.

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139 (4) ప్రకారం, నిర్ణీత గడువులోపు ఐటీఆర్ ఫైల్ చేయని పన్ను చెల్లింపుదారులు పెనాల్టీ చెల్లించి, ఆలస్యంగా సమర్పించే రిటర్న్...