భారతదేశం, జనవరి 28 -- ISRO 100th mission: ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న శ్రీహరికోటలోని సతీష్ దావన్ అంతరిక్ష కేంద్రం నుంచి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ప్రతిష్టాత్మక 100వ మిషన్ కు కౌంట్ డౌన్ మంగళవారం ప్రారంభమైంది. ఇస్రో చైర్మన్ గా వి.నారాయణన్ బాధ్యతలు చేపట్టిన తరువాత ఇది తొలి మిషన్. ఈ ప్రయోగంలో జీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా నావిగేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నారు. నారాయణన్ జనవరి 13న బాధ్యతలు స్వీకరించారు.

నావిగేషన్ ఉపగ్రహం ఎన్వీఎస్-02ను మోసుకెళ్లిన జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (GSLV) 17వ ప్రయోగంలో స్వదేశీ క్రయోజనిక్ అప్పర్ స్టేజ్ తో జనవరి 29న ఉదయం 6.23 గంటలకు నింగిలోకి దూసుకెళ్లనుంది. లిఫ్ట్ ఆఫ్ సమయానికి 27 గంటల ముందు, అంటే మంగళవారం వేకువజామున 02.53 గంటలకు 27.30 గంటల కౌంట్ డౌన్ ప్రారంభమైంది. 50.9 మీటర్ల పొడవైన జీఎస్ఎల్వీ-ఎఫ్ 15, జిఎస్ఎల...