Hyderabad, ఫిబ్రవరి 26 -- ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ తన భర్త అనంద్ పిరమల్‌తో కలిసి ప్రయాగరాజ్‌లోని మహాకుంభ్ మేళాలో పాల్గొంది. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేసి ప్రార్థనలు చేసింది. ఈ ఆధ్యాత్మిక పర్యటనలో ఇషా పింక్ డ్రెస్సును ధరించింది. ఈ డ్రెస్సు సాదాసీదాగా కనిపిస్తోంది కానీ ఖరీదు మాత్రం చాలా ఎక్కువ. వేల కోట్లు ఉన్న ఆమె ఒక సాదా డ్రెస్సు కోసం ఆ మాత్రం ఖర్చు పెట్టడంలో తప్పేమీ లేదంటున్న ఫ్యాషన్ డిజైనర్లు ఉన్నారు.

ఇషా అంబానీ చక్కని ఫ్యాషన్ ఐకాన్. ఆమె ఎంపిక చేసుకునే దుస్తులు ఎంతో అందంగా ఉంటాయి. అద్భుతమైన కుట్టుపనితో కూడిన డ్రెస్సులను ఆమె ఎంపిక చేసుకుంటుంది. ఖరీదైన ఆభరణాలను ధరించి ప్రపంచాన్ని ఆకర్షిస్తుంది. తాజాగా ఆమె కుంభమేళాకు ఒక పింక్ డ్రెస్సు వేసుకుని వచ్చింది. ఆ డ్రెస్సు చూస్తే చాలా సింపుల్ గా కనిపిస్తోంది. కానీ ఖరీదు మాత్రం చాలా ఎ...