Hyderabad, మార్చి 22 -- పసిబిడ్డ రూపంలో ఓ కొత్త వ్యక్తి మన జీవితాల్లోకి రాగానే చాలా సంతోషంగా ఉంటుంది. కానీ, అప్పుడే తల్లి అయిన మహిళలకు మాత్రం ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. నిద్రలేని రాత్రులు, హార్మోనల్ సమస్యలు, క్రమంలేని పీరియడ్స్ వంటి సమస్యలు తరచుగా వేధిస్తుంటాయి. పిల్లలకి పాలిస్తుండటం వల్ల తల్లుల్లో హార్మోనల్ సమస్యలు, స్ట్రెస్ పెరగడం లాంటివి సంభవించి చికాకును కలిగిస్తాయి. ఒత్తిడి పెరిగి మానసిక ప్రశాంతతను కోల్పోతారు. ప్రధానంగా డెలివరీ తర్వాత పీరియడ్స్ రావడం కూడా ఆలస్యంగా లేదా ముందే రావడం జరుగుతుంటుంది. దీనిని చాలా వరకూ సాధారణంగానే పరిగణించాలి. కాకపోతే, అదే సమస్య నెలల తరబడి కొనసాగుతుంటే, తప్పకుండా వైద్యుడ్ని కలవాల్సి ఉంటుంది.

డెలివరీ తర్వాత మహిళల్లో పీరియడ్స్ క్రమం తప్పి రావడం జరుగుతుంది. పిల్లల్ని కనడం వల్ల జరిగే హార్మోనల్ మార్పులు కూడా దీ...