Hyderabad, ఏప్రిల్ 3 -- గర్భధారణ సమయంలో చిన్న నిర్లక్ష్యం కూడా తల్లి, బిడ్డ ఇద్దరి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. తొమ్మిది నెలల పాటు ఉండే ప్రెగ్నెన్సీలో ఆహారంపై, నిద్ర, వంటి అన్ని రకాల విషయంలో శ్రద్ధ వహించడం చాలా అవసరం. ముఖ్యంగా తల్లీ బిడ్డా ఆరోగ్యం కోసం కడుపులోని బిడ్డ ఎదుగుదల కోసం సరైన పోషకాలను తీసుకోవడం చాలా అవసరం. ప్రెగ్నెన్సీ అన్నింటికన్నా ముఖ్యంగా ఐరన్ లెవెల్స్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం ముఖ్యమని నిపుణులు చెబుతుంటారు.

ఎందుకంటే హిమోగ్లోబిన్‌ను ఉత్పత్తి చేయడానికి శరీరానికి ఐరన్(ఇనుము) చాలా అవసరం. ఇది ఎర్ర రక్త కణాలలో ఉండే ప్రోటీన్. తల్లి ఆరోగ్యం, బిడ్డ అవయవాల ఎదుగుదల, కణజాలాలకు ఆక్సిజన్ ప్రవాహాన్ని పెంచడంలో ఐరన్ ముఖ్యపాత్ర పోషిస్తుంది. అందుకే వైద్యులు గర్భిణీ స్త్రీలకు ఇనుము లభించే ఆహారాలను ఎక్కువగా తినాలిని, ఐరన్ ట్యాబ్లెట్లను తర...