Hyderabad, జనవరి 26 -- దోశ చాలా మందికి ఇష్టమైన టిఫిన్. ఉదయం టిఫిన్ , మధ్యాహ్నం భోజనం, స్నాక్స్, రాత్రి భోజనం, ఇలా ఎప్పుడైనా దోశను ఆస్వాదించవచ్చు. ముందు రోజు దోశ పిండి నానబెట్టి పులియబెడితే చాలు, మరుసటి రోజు చట్నీ చేసి దోశ వేసుకోవచ్చు. తక్కువ సమయంలో అయ్యే టిఫిన్ అలాగే మంచి బ్రేక్‌ఫాస్ట్ తిన్న సంతోషం. ఒక్కమాటలో చెప్పాలంటే తక్కువ సమయంలో, సులభంగా, రుచికరంగా తయారయ్యే టిఫిన్లలో దోశ ఒకటి.

వాస్తవమేంటంటే.. హోటళ్లలో రకరకాల దోశలు దొరుకుతాయి. ప్లేన్ దోశ, మసాలా దోశ, పన్నీర్ దోశ, బటర్ దోశ, రవ్వ దోశ, ఉల్లి దోశ. పేరేదైనా బ్రౌన్ కలర్‌లో క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది. కానీ ఇంట్లో అదే విధంగా చేయడానికి ప్రయత్నిస్తే ఎందుకు రాదు? హోటల్‌లో వాడే పదార్థాలనే మనం కూడా వాడతాం, పిండి నానబెడతాం, పులియబెడతాం. అయినా హోటల్‌లో లాగా బ్రౌన్ కలర్ దోశ ఎందుకు రాదు, ఎక్కడ తప్పు ...