Hyderabad, ఫిబ్రవరి 22 -- ఆరోగ్యకరమైన ఆహారం తయారు చేసేందుకు సరైన పదార్థాలను ఎంచుకోవడం ఎంత ముఖ్యమో, వాటిని వండేందుకు సరైన పాత్రలను ఎంచుకోవడం కూడా అంతే ముఖ్యం. దక్షిణ భారతదేశంలోనే కాదు, మనదేశంలో చాలా మంది ఇనుప కడాయిలను చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు. పైగా అందరిలో ఉండే భావన, వీటిల్లో వండితే చాలా ప్రయోజనకరమైనది అని. శరీరంలో ఇనుము లోపం ఉన్నవారికి ఇనుప కడాయిలో వండిన ఆహారం చాలా ప్రయోజనకరమైనదిగా భావిస్తారు. వాస్తవానికి ఇనుప పాత్రల్లో వండటం వల్ల కలిగే ప్రయోజనాలు అటుంచితే, వీటి వల్ల నష్టాలు బోలెడు ఉన్నాయట. ఈ సమస్య నుంచి గట్టెక్కాలంటే, కొన్ని కూరగాయలను ఇనుప కడాయిలో వండకపోవడమే బెటర్. ఇలా చేయడం వల్ల వాటి రంగు, రుచి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా హాని కలుగుతుంది.

ఐరన్ కడాయికి బదులుగా, స్టీల్ లేదా అల్యూమినియం వంటి నాన్-రియాక్టివ్ మెటల్ పాత్రలలో మాత్రమే...