భారతదేశం, మే 12 -- IRCTC Tamilnadu Tour Package : తమిళనాడులోని ప్రముఖ దేవాలయాలను దర్శించుకోవాలని అనుకుంటున్నారా? అయితే హైదరాబాద్ నుంచి ట్రెజర్స్ ఆఫ్ తమిళనాడు ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఆరు రోజుల్లో తమిళనాడులోని కుంభకోణం, మధురై, రామేశ్వరం, తంజావూరు వంటి ప్రముఖ ప్రాంతాలు, దేవాలయాలను సందర్శించవచ్చు. రూ.29,250 ప్రారంభ ధరతో హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ ఎయిర్ టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ఆగస్టు 13 నుంచి 18 మధ్యలో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. మొత్తం 29 టికెట్లతో ఎయిర్ టూర్ అందిస్తోంది ఐఆర్సీటీసీ.

మధ్యాహ్నం హైదరాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరుతారు. సాయంత్రానికి తిరుచ్చి చేరుకుంటారు. ఎయిర్ పోర్టులో పికప్ చేసుకుని హోటల్‌కి తీసుకెళ్తారు. రాత్రి బస తిరుచ్చిలో చేస్తారు.

బ్రేక్ ఫాస్ట్ తర్వాత హోటల్ చెక్ అవుట్ చేస్తారు. శ్రీరంగం ఆలయాన్ని, జంబ...