భారతదేశం, మార్చి 1 -- IRCTC Jyotirlinga Yatra : యాత్రికుల‌కు, భ‌క్తుల‌కు విజ‌య‌వాడ ఐఆర్‌సీటీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. జ్యోతిర్లింగ స‌హిత దివ్య ద‌క్షిణ యాత్ర పేరుతో ప్రత్యేక ప్యాకేజీని ప్రక‌టించింది. భారత్ గౌర‌వ్ స్పెష‌ల్ రైలును న‌డ‌పేందుకు ఐఆర్‌సీటీసీ నిర్ణయించింది. ఈ అవ‌కాశాన్ని యాత్రికులు, భ‌క్తులు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని ఐఆర్‌సీటీసీ కోరుతోంది.

మొత్తం ఎనిమిది రాత్రులు/తొమ్మిది రోజుల యాత్ర కొన‌సాగుతుంది. మొత్తం 718 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అందులో 460 స్లీప‌ర్ క్లాస్‌, 206 థ‌ర్డ్ ఏసీ, 52 సెకెండ్ ఏసీ బెర్త్‌లు ఉన్నాయి.

రైలు మార్చి 21 తేదీన మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు సికింద్రాబాద్‌ నుంచి ప్రారంభమవుతుంది. భువ‌న‌గిరి, జ‌న‌గామ, కాజీపేట‌, వ‌రంగ‌ల్‌, మ‌హ‌బుబాబాద్‌, డోన్నక‌ల్‌, ఖ‌మ్మం, మ‌ధిర‌, విజ‌య‌వాడ, తెనాలి, చీరాల‌, ఒంగోలు, కావ‌లి, నెల్లూరు...