భారతదేశం, జనవరి 27 -- భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు ప్రయాణికుల కోసం కొత్త సౌకర్యాలను తెస్తుంది. దీనిద్వారా ప్రయాణం సులభతరం అవుతుంది. రైలు టికెట్ బుక్ చేసినప్పుడు తరచుగా బుకింగ్ కన్ఫామ్‌లో ఆలస్యం లేదా క్యాన్సిల్ చేయడం, వాపసు వంటి సమస్యలను ఎదుర్కొంటాం. కొన్నిసార్లు డబ్బు కట్ అయినా వాపస్ రావడం లేట్ అవుతుందనే భయం ఉంటుంది. చాలాసార్లు టికెట్లు సకాలంలో బుక్ కాదు. ఇప్పుడు ఈ సమస్యలను తగ్గించుకోవచ్చు. ఐఆర్‌సీటీసీకి eWallet ఉంది. ఇది టిక్కెట్ బుకింగ్ ప్రక్రియను సులభతరం చేస్తుంది.

రైలు టిక్కెట్లను బుక్ చేయడంలో వైఫల్యం, ఆలస్యంగా బుకింగ్ కన్ఫామ్, క్యాన్సిల్ వంటి సమస్యలు వస్తాయి. ఐఆర్‌సీటీసీ ఈ సమస్యలను పరిష్కరించేందుకు ఈ వ్యాలెట్ తీసుకొచ్చింది. దీని ద్వారా టిక్కెట్లను తక్షణమే బుక్ చేసుకోవచ్చు. ఈ వ్యాలెట్ ద్వారా చెల్లింపు ప్రక్రియ ఇతర చెల్లింపుల పద్ధతి కం...