భారతదేశం, ఫిబ్రవరి 19 -- దేశంలో ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు రైళ్లలో వెళ్తుంటారు. రైలు ప్రయాణం అందరిక సౌకర్యవంతంగా ఉంటుంది. అంతేకాదు.. చాలా తక్కువ ధరలో మీ గమ్యస్థానాన్ని చేరుకోవచ్చు. ప్రయాణికుల సౌలభ్యం కోసం భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు కొత్త రూల్స్, స్కీమ్స్ తీసుకొస్తుంది. కొన్ని రోజుల కిందట బుక్ నౌ.. పే లేటర్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీని కింద ప్రయాణికులు వెంటనే డబ్బులు చెల్లించకుండా రైలు టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. తరువాత డబ్బులు చెల్లించవచ్చు.

చాలా మందికి ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే కొన్నిసార్లు డబ్బులు ఉండకపోవచ్చు. దీనితో ప్రయాణం క్యాన్సిల్ అవ్వొచ్చు. అలాంటివారికి ఇకపై టెన్షన్ లేదు. ఐఆర్‌సీటీసీ అందించే.. బుక్ నౌ పే లేటర్ ద్వారా మీరు ఈజీగా రైలు టికెట్ బుక్ చేయవచ్చు. క్రెడిట్ కార్డులను ఉపయోగించకూడదనుకునే వ...