భారతదేశం, మార్చి 31 -- Ippa Puvvu Laddu : ఆదిలాబాద్ అంటేనే ఆదివాసీలు అని పేరున్న జిల్లా... అలాంటి ఆదివాసులు జాతీయ స్థాయిలో పేరుసంపాదించారు. స్థానికంగా వారు సహకార సంఘం ఆధ్వర్యంలో...ప్రతినెలా ఇప్పపువ్వు లడ్డూలు తయారు చేస్తున్నారు. ఉట్నూర్ ఐటీడీఏ అధికారులు ప్రోత్సహించిన తీరు సత్పలితాలు ఇస్తోంది. ఈ విషయం ఏకంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 125వ మన్ కీ బాత్ లో చర్చించి గిరిజన మహిళలను మేచ్చుకున్నారు. దీంతో ఆదిలాబాద్ ఇప్పపువ్వు లడ్డూకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.

ప్రధాని మోదీ మెచ్చిన ఇప్పపువ్వు లడ్డూ ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలానికి చెందిన ఆదివాసీ మహిళలు భీంబాయి ఆదివాసీ సహకార సంఘం ఆధ్వర్యంలో తయారవుతోంది. వీటిని అధికారులు కొనుగోలు చేసి గిరిజన గర్భిణులకు, బాలింతలకు, రక్తహీనతతో బాధపడుతున్న వారికి, ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలలో మహిళలకు అందజే...