భారతదేశం, ఏప్రిల్ 10 -- IPL Bettings: బెట్టింగ్‌ యాప్‌ల మోజులో పడి వారి బంగారు భవిష్యత్తును అంధకారం చేసుకోవడమే కాకుండా, ఆప్పుల పాలై ప్రాణాల మీదకు తెచ్చుకోవడంపై మెదక్‌ పోలీసులు దృష్టి సారించారు. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి సాధించడంతో ప్రతి ఒక్కరికి ఇంటర్‌నెట్ అందుబాటులోకి రావడంతో పాటు, సోషల్‌ మీడియా యువతకు మరింత చేరువ కావడంతో బెట్టింగ్‌ యాప్స్‌ వినియోగం పెరిగిందని మెదక్‌ ఎస్సీ ఉదయ్ కుమార్‌ రెడ్డి వివరించారు.

ద్వారా మోసగాళ్ళ మోసపూరితమైన ప్రకటనలు, సందేశాలకు యువత ఆకర్షితులై సులభంగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంగా ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌ ద్వారా క్రికెట్‌ బెట్టింగ్‌ పాటు, ఇతరత్రా బెట్టింగ్‌ల పాల్పడుతున్నారన్నారు.

కుటుంబ సభ్యులకు తెలియకుండా బెట్టింగుల్లో పెట్టుబడులు పెట్టి ఆర్థికంగా పూర్తిగా నష్టపోవడంతో పాటు కొన్ని సందర్భాల్లో యువత బలవన్మర...