భారతదేశం, ఏప్రిల్ 7 -- ఐపీఎల్ 2025లో ముంబయి ఇండియన్స్ తో మ్యాచ్ కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ధరించిన డైమండ్ రింగ్ వైరల్ గా మారింది. ఆ డైమండ్ రింగ్ ధరించిన అతను.. డబ్ల్యూడబ్ల్యూఈ లెజెండ్ జాన్ సీనా స్టైల్లో చేసిన గెస్చర్ కూడా అదిరిపోయింది. ఆర్సీటీ టీమ్ సభ్యులతో కలిసి కోహ్లి చేసిన డ్యాన్స్ మూవ్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ వీడియో ఇప్పుడు ట్రెండ్ అవుతోంది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ విరాట్ కోహ్లి ఇంటర్నెట్ ను మరోసారి ఊపేస్తున్నాడు. ఐపీఎల్ 2025లో నేడు (ఏప్రిల్ 7) వాంఖడే స్టేడియంలో ముంబయి ఇండియన్స్ ను ఆర్సీబీ ఢీ కొడుతోంది. ఈ మ్యాచ్ కు ముందు కోహ్లి స్పెషల్ రింగ్ ధరించడం వైరల్ గా మారింది. అంతే కాకుండా ఆ రింగ్ ధరించి.. లెజెండ్ జాన్ సీనా ఐకానిక్ గెస్చర్ 'మీరు నన్ను చూడలేరు (యూ కెనాట్ సీ మీ)' అనేలా చేయి...