భారతదేశం, మార్చి 31 -- బాలీవుడ్ నటి మలైకా అరోరా, లెజండరీ క్రికెటర్ కుమార సంగక్కర మధ్య ఏదో జరుగుతుందనే ప్రచారం ఊపందుకుంది. వీళ్లు డేటింగ్ చేస్తున్నారనే వార్తలు వైరల్ గా మారాయి. ఐపీఎల్ 2025 లో ఆదివారం (మార్చి 30) రాత్రి చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ సందర్భంగా స్టాండ్స్ లో మలైకా, సంగక్కర పక్కపక్కనే కూర్చోవడంతో రూమర్స్ జోరుగా వినిపిస్తున్నాయి.

గౌహతిలోని బర్సపార క్రికెట్ స్టేడియంలో జరిగిన సీఎస్కే వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ లో సంగక్కర, మలైకా ఫొటో వైరల్ గా మారింది. మాజీ శ్రీలంక క్రికెటర్, రాజస్థాన్ రాయల్స్ క్రికెట్ డైరెక్టర్‌ సంగక్కరతో కలిసి మలైకా మ్యచ్ ను ఎంజాయ్ చేస్తున్న సీన్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సంగక్కర గతంలో రాజస్థాన్ రాయల్స్ కోచ్ గానూ పనిచేసిన సంగతి తెలిసిందే.

బాలీవుడ్ నటి, హాట్ భామ మలైకా అరోరా ఐపీఎల్ మ్య...