భారతదేశం, ఏప్రిల్ 5 -- ఐపీఎల్ 2025 లో శుక్రవారం (ఏప్రిల్ 4) ముంబయి ఇండియన్స్ పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. ఈ విక్టరీ తర్వాత జరిగిన ప్రెస్ కాన్ఫ్‌రెన్స్‌లో లక్నో కోచ్ జస్టిన్ లాంగర్ రిపోర్టర్లతో మాట్లాడాడు. అదే సమయంలో ఓ రిపోర్టర్ కు తల్లి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అప్పుడు ఆ ఫోన్ తీసుకున్న లాంగర్ చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చక్కర్లు కొడుతోంది.

ఐదుసార్లు ఛాంపియన్ గా నిలిచిన ముంబయి ఇండియన్స్ పై ఐపీఎల్ 2025లో తమ జట్టు విజయం సాధించిన తర్వాత లాంగర్ ఆనందం వ్యక్తం చేశాడు. అదే సమయంలో వాయిస్ రికార్డు కోసం టేబుల్ పై ఉంచిన ఫోన్లలో ఒక ఫోన్ మోగింది. అమ్మ నుంచి కాల్ వచ్చింది. ఆ ఫోన్ తీసుకున్న లాంగర్.. ''ఎవరి అమ్మ'' అని అడిగాడు. కాల్ లిప్ట్ చేసి మాట్లాడాడు.

"అమ్మా.. అర్ధరాత్రి 12:08 అయింది. నేను ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఉ...