భారతదేశం, ఏప్రిల్ 14 -- అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆదివారం (ఏప్రిల్ 13) జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పై ముంబయి ఇండియన్స్ విజయం సాధించింది. ఛేజింగ్ లో 19వ ఓవర్లు మూడు రనౌట్లతో ముంబయి ఆలౌటైంది. దీంతో ఢిల్లీకి హోం గ్రౌండ్ లో షాక్ తప్పలేదు. ఈ సీజన్ లో ఆ టీమ్ కు ఇదే ఫస్ట్ ఓటమి. అయితే మరోవైపు ఈ స్టేడియంలోని గ్రౌండ్ లో ఘర్షణ నెలకొంది. గొడవలో భాగంగా ఓ వ్యక్తిపై లేడీ ఫ్యాన్ దాడి చేయడం వైరల్ గా మారింది.

ఐపీఎల్ 2025లో డీసీ వర్సెస్ ఎంఐ మ్యాచ్ సందర్భంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లి స్టేడియంలోని స్టాండ్స్ లో తీవ్ర గొడవ జరిగింది. రెండు ఫ్యామిలీల మధ్య ఈ ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. ఈ గొడవలో భాగంగా ముఖ్యంగా ఓ అమ్మాయి.. అబ్బాయిను కొడుతున్నట్లు కనిపించింది. ఆ వెంటనే సెక్యూరిటీ వచ్చి గొడవకు ముగింపు పలికారు. అయితే ఈ గొడవ దారితీసిన కారణాలు తెలియరా...