భారతదేశం, మార్చి 30 -- పాట్ కమిన్స్ నాయకత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ హోమ్ వెన్యూను మార్చాలని ఆలోచిస్తోంది. ఫ్రీ టికెట్ల కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) టాప్ ఆఫీస్ బేరర్స్ బ్లాక్ మెయిల్ చేయడాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ తట్టుకోలేకపోతుందని తెలిసింది. దీని వలన ఫ్రాంచైజీ తమ మిగిలిన హోమ్ మ్యాచ్‌లను ఎక్కడ ఆడాలనే దానిపై పునరాలోచన చేస్తోంది.

'టైమ్స్ ఆఫ్ ఇండియా' రిపోర్ట్ ప్రకారం సన్‌రైజర్స్ హైదరాబాద్ జనరల్ మేనేజర్ శ్రీనాథ్ టీబీ.. హెచ్‌సీఏ కోశాధికారి సీజే శ్రీనివాస్ రావు కు ఈ మెయిల్ పంపించాడు. ఈ ఈ-మెయిల్ వైరల్ గా మారింది.

"హెచ్‌సీఏ, ముఖ్యంగా హెచ్‌సీఏ ప్రెసిడెంట్ చేస్తున్న ఈ అన్ ప్రొఫెషనల్ బెదిరింపులు, చర్యలు.. మీ స్టేడియంలో సన్‌రైజర్స్ ఆడాలని కోరుకోవడం లేదని స్పష్టం చేస్తున్నాయి. అలా అయితే మాకు రాతపూర్వకంగా తెలియజేయండి....