భారతదేశం, మార్చి 11 -- భారత స్టార్ ఆల్‍రౌండర్ రవీంద్ర జడేజాకు తెలుగు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప మూవీ బాగా ఇష్టం. గతంలోనూ గ్రౌండ్‍లో తగ్గేదెలే అంటూ పుష్ప సిగ్నేచర్ మూవ్‍మెంట్ చేశాడు. సోషల్ మీడియాలోనూ పుష్పలో అల్లు అర్జున్‍లా కనిపించేలా ఓ పిక్ పెట్టాడు. సీక్వెల్ పుష్ప 2 గతేడాది రిలీజ్ కాగా.. ఇప్పుడు మరోసారి ఆ స్టైల్ ఫాలో అయ్యాడు జడ్డూ. ఐపీఎల్ 2025 కోసం చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‍కే) క్యాంప్‍లో అడుగుపెట్టాడు జడేజా. ఈ వీడియోను సీఎస్‍కే సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

రెండు రోజుల కిందట ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‍లో రవీంద్ర జడేజా విన్నింగ్ షాట్ కొట్టాడు. భారత్ టైటిల్ సొంతం చేసుకుంది. దుబాయ్ నుంచి వచ్చిన జడేజా ఐపీఎల్ 2025 సీజన్ కోసం అప్పుడే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో కలిశాడు. పుష్ప స్టైల్‍లో సీఎస్‍కే డెన్‍లోకి వచ్చాడు. పుష్ప...