భారతదేశం, ఏప్రిల్ 4 -- iPhone prices: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాల కారణంగా ఐఫోన్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. తమ ఫోన్లను అప్ గ్రేడ్ చేయాలని యోచిస్తున్న వినియోగదారులు త్వరపడండి. ఎందుకంటే, త్వరలో ఐఫోన్ ల ధరలు 40% వరకు పెరగవచ్చు. అయితే, ఈ టారిఫ్ ల భారాన్ని ఆపిల్ తనే భరిస్తుందా? లేక కస్టమర్లకు బదిలీ చేస్తుందా? అనే విషయంపై ఆధారపడి ఉంటుంది.

చైనా నుంచి అమెరికా దిగుమతి చేసుకుంటున్న ఉత్పత్తులపై 54% సుంకం విధించాలన్న ట్రంప్ నిర్ణయం ఆపిల్ ను క్లిష్ట స్థితిలోకి నెట్టింది. దీని పరికరాలు చాలావరకు చైనాలో తయారవుతాయి. దాంతో అదనపు సుంకాల ప్రభావం ఆపిల్ పై నేరుగా పడుతుంది. ఆ భారాన్ని ఆపిల్ ఎలా మేనేజ్ చేస్తుందనే విషయంపై ఆపిల్ ఉత్పత్తుల ధరలు ఆధరపడుతాయి. ఈ టారిఫ్ ల భారాన్ని ఆపిల్ తనే భరిస్తుందా? లేక కస్టమర్లకు బదిలీ చేస్తుందా? అనేది ప్...