భారతదేశం, సెప్టెంబర్ 19 -- ఐఫోన్ 17 సిరీస్ సేల్​ సందర్భంగా ముంబై, దిల్లీల్లోని యాపిల్ స్టోర్ల వద్ద శుక్రవారం భారీగా జనం పోటెత్తారు. ఈ రద్దీలో, ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేస) స్టోర్ వద్ద క్యూలో నిలబడిన కొందరి మధ్య తోపులాట చోటు చేసుకుంది!

క్యూలోని ప్రజల మధ్య గందరగోళం చెలరేగడంతో, కనీసం ఇద్దరు వ్యక్తులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీంతో భద్రతా సిబ్బంది జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. న్యూస్ ఏజెన్సీ పీటీఐ షేర్ చేసిన ఒక వీడియోలో.. క్యూలో ఉన్న ఇతర వ్యక్తులు వారిని విడదీయడానికి ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఆ ఇద్దరు వ్యక్తులు పిడిగుద్దులు, చేతులతో ఒకరినొకరు కొట్టుకోవడం కనిపించింది.

ఈ గొడవతో క్యూ కాసేపు నిలిచిపోయింది. దీంతో యాపిల్ స్టోర్ వద్ద భద్రత కోసం మోహరించిన గార్డులు వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ తోప...