భారతదేశం, ఫిబ్రవరి 23 -- యాపిల్​ తన మోస్ట్​ అఫార్డిబుల్​ ఐఫోన్​ని ఇటీవలే లాంచ్​ చేసింది. దీని పేరు ఐఫోన్​ 16ఈ. ఇప్పటికే మార్కెట్​లో ఉన్న అనేక స్మార్ట్​ఫోన్స్​కి ఇది పోటీ ఇవ్వనుంది. మరీ ముఖ్యంగా ఐఫోన్​ 16ఈని శాంసంగ్​ గెలాక్సీ ఎస్​24 ఎఫ్​ఈతో పోల్చుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండింటిలో ఏది బెస్ట్​? దేని ధర తక్కువ? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఐఫోన్​ 16ఈ, శాంసంగ్​ గెలాక్సీ ఎస్​24 ఎఫ్​ఈ స్మార్ట్​ఫోన్స్​ సుపరిచితమైన డిజైన్లను కలిగి ఉన్నాయి. ఫ్లాట్ సైడ్స్, రౌండ్​ ఎడ్జెస్​, ఫ్లాట్ స్క్రీన్​తో ఐఫోన్ 16ఈ యాపిల్ ట్రెండ్​ను కొనసాగిస్తుంది. శాంసంగ్​ గెలాక్సీ ఎస్24 ఎఫ్​ఈ ఇదే విధానాన్ని అనుసరిస్తుంది కాని కాస్త డిఫరెంట్​గా ఉంటుంది. రెండింటిలోనూ వాటర్​, డస్ట్​ రెసిస్టెన్స్​ కోసం ఐపీ68 రేటింగ్ ఉంది. అనేక ఫీచర్స్​ని ఇన్​స్టెంట్​గా లాంచ్​ చేసేందుకు యాపిల...