భారతదేశం, ఫిబ్రవరి 20 -- iPhone 16e: కొన్ని ఆకర్షణీయమైన ఫీచర్లతో ఫిబ్రవరి 19 న లేటెస్ట్ అఫర్డబుల్ మోడల్ గా ఐఫోన్ 16ఈ ని ఆపిల్ ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేసింది. పేరును మార్చడమే కాకుండా 2022 ఐఫోన్ ఎస్ఈ 3ని నిలిపివేయడం ద్వారా ఐఫోన్ ఎస్ఈ వారసత్వానికి వీడ్కోలు పలికింది. అందువల్ల, సమీప భవిష్యత్తులో ఎటువంటి ఎస్ఈ మోడళ్లను చూడలేము. తాజాగా, ఐఫోన్ ఎస్ఈ 3తో పాటు, ఆపిల్ అనేక పాపులర్ స్మార్ట్ ఫోన్ లను నిలిపివేసింది. ఇది ఆపిల్ అభిమానులను షాక్ కు గురిచేసింది.

ఐఫోన్ 16ఈ లాంచ్ తో, ఐఫోన్ ఎస్ఈ 3 (2022), ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ అనే మూడు స్మార్ట్ ఫోన్ మోడళ్లను ఆపిల్ అధికారికంగా నిలిపివేసింది. ఈ ఐఫోన్ లతో పాటు, హోమ్ బటన్, టచ్ ఐడి, ఎల్సిడి స్క్రీన్, సబ్-6-అంగుళాల స్క్రీన్ వంటి కొన్ని ఫీచర్లకు ఆపిల్ వీడ్కోలు పలికింది. ఎందుకంటే ఇవి ప్రీమియం సెగ్మెంట్లలో వినియోగదార...