భారతదేశం, జనవరి 28 -- iOS 18.3: ఆపిల్ ఎట్టకేలకు ఐఓఎస్ 18.3 ను విడుదల చేసింది. ఇది అన్ని కంపేటబుల్ డివైజెస్ కు తదుపరి ప్రధాన ఐఓఎస్ అప్డేట్. ముఖ్యంగా ఐఫోన్ 16 సిరీస్ కు సంబంధించి పలు అప్డేట్ లను ఇది తీసుకొస్తోంది. ఇందులో విజువల్ ఇంటెలిజెన్స్ అప్ గ్రేడ్స్, బగ్ ఫిక్సింగ్, పలు సెక్యూరిటీ అప్ డేట్స్ ఉన్నాయి. లేటెస్ట్ ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లతో సహా ఐఓఎస్ 18.3 అప్డేట్ తో లభించే అప్ గ్రేడ్స్ గురించి ఇక్కడ తెలుసుకోండి.

మీరు ఐఫోన్ 16 మోడల్ ను ఉపయోగిస్తుంటే, కెమెరా కంట్రోల్ గురించి, దానిని ఎక్కువసేపు నొక్కడం ద్వారా మీరు విజువల్ ఇంటెలిజెన్స్ ను ఎలా యాక్టివేట్ చేయవచ్చో మీకు తెలుస్తుంది. ఆపిల్ ఐఓఎస్ 18.2 అప్ డేట్ తో దీనిని ప్రారంభించింది. ఇప్పుడు, ఐఓఎస్ 18.3 తో, ఆపిల్ మరింత సామర్థ్యాలతో ఈ ఫీచర్ ను విస్తరిస్తోంది. పోస్టర్ లేదా ఫ్లైయర్ నుండి మీ క్యాలెండ...