భారతదేశం, జనవరి 28 -- దావోస్ పర్యటనతో లక్షా 80 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను పెట్టేలా మన రాష్ట్రం ఆకర్షించగలిగిందని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పారు. సచివాలయంలో మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. రాజకీయంగా విభేదించినా రాష్ట్ర అభివృద్ధి విషయంలో వివాదాలకు వెళ్లొద్దని హితవు పలికారు. పెట్టుబడులకు అవసరమైన భూ కేటాయింపులు చేసి.. అన్ని రకాలుగా ఆ సంస్థలను ప్రోత్సహిస్తామని చెప్పారు.

అందరం కలిసి కష్టపడితేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం అవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని 1 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వివరించారు. సింగపూర్ ఆధ్వర్యంలో నడుస్తుస్తున్న ఐటీఈ సంస్థతో కూడా ఒప్పందాలు చేసుకున్నామని వెల్లడించారు. ఇది భవిష్యత్‌లో మన సాంకేతికను పెంపొందించడానికి ఉపయోగపడుత...