భారతదేశం, మార్చి 30 -- Investment Fraud : ఇన్వెస్ట్మెంట్ పేరుతో ఘరానా మోసానికి పాల్పడిన సైబర్ నేరస్తుడిని కరీంనగర్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. గుజరాత్ లోని సూరత్ జిల్లాకు చెందిన నితిన్ దేవచంద్ భాయ్ గజెరాని పట్టుకొచ్చి కరీంనగర్ కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు తరలించారు. నిందితునికి సహకరించిన వారిని గుర్తించి పట్టుకునే పనిలో సైబర్ క్రైమ్ పోలీసులు నిమగ్నమయ్యారు.

సోషల్ మీడియా ఇన్ స్టాగ్రామ్ లో ఇన్వెస్ట్మెంట్ కు సంబంధించిన ప్రకటన చూసి కరీంనగర్ కు చెందిన వ్యక్తి ఆకర్షితుడయ్యాడు. జులై 2024 నుంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టడం ప్రారంభించాడు.

ఇన్వెస్ట్మెంట్ పెట్టే క్రమంలో మొదటగా పెట్టినటువంటి వెయ్యి రూపాయలకు రెండు వేల రూపాయల వరకు లాభం రావడం జరిగింది. బాధితుడు సైబర్ నేరగాళ్లు మొదట పంపించిన లాభాన్ని చూసి వారి మాటలను నమ్మి లోన్ తీసుకుని సైబర్ నేర...