Hyderabad, ఫిబ్రవరి 12 -- ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వెళ్లినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. హెయిర్ స్టైల్ నుంచి డ్రెస్సింగ్ వరకు పరిశుబ్రంగా ఉండేలా చూసుకోవాలి. మీ లుక్ ఎదుటివారికి మీపై ఒక అభిప్రాయాన్ని కలిగిస్తుంది. మంచి డ్రెస్సింగ్ తో పాటూ మంచి వ్యక్తిత్వం కూడా ఒక మనిషికి సంపూర్ణమైన లుక్ ను అందిస్తుంది. ఒక మంచి వ్యక్తిత్వాన్ని అనేక విషయాల ద్వారా నిర్ణయిస్తారు. కాబట్టి, ఇంటర్వ్యూ కోసం మీరు ఏమి ధరిస్తారనే దానిపై కూడా శ్రద్ధ వహిస్తారు. ఇంటర్వ్యూ కోసం మీరు ఎటువంటి దుస్తులు ధరించకూడదో మేము మీకు చెబుతున్నాము.

జీన్స్, షార్ట్స్, హూడీస్, టీషర్ట్స్ చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి. కానీ జాబ్ ఇంటర్వ్యూ కోసం ఇలాంటి దుస్తులు ధరించడం కరెక్ట్ కాదు. బదులుగా, మీరు మరింత పాలిష్ చేసిన, స్మార్ట్-క్యాజువల్ లుక్ ఇచ్చే దుస్తులను ఎంచుకోవాలి. ప్యాంటు, బటన్ డౌన్ షర్టు...