భారతదేశం, ఫిబ్రవరి 26 -- ప్రస్తుత కాలంలో ఇంటర్నెట్ నిత్యవసరంగా మారింది. నెట్ లేనిది ఏ చాలా పనులు చేయకుండా అయిపోయింది. ఇది ఒక అవసరంగా మారింది. ఇంటర్నెట్ కొన్ని గంటలు డౌన్ అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇంటర్నెట్ కారణంగా జనసమూహాన్ని సమీకరించడం చాలా సులభం అయింది. సోషల్ మీడియాలో ఒకే ఒక పోస్ట్‌తో గంటలోపు పెద్ద ర్యాలీని నిర్వహించిన ఘటనలూ ఉన్నాయి. మరోవైపు ఇంటర్నెట్ దుర్వినియోగానికి సంబంధించిన అనేక కేసులు కూడా వెలుగులోకి వచ్చాయి. కొన్ని కారణాలతో అనేక దేశాలలో ఇంటర్నెట్ షట్‌డౌన్ జరిగింది.

2024 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ 296 సార్లు నిలిపివేశారు. 54 దేశాలలో ఇంటర్నెట్ షట్‌డౌన్ జరిగింది. ఇది ఒక కొత్త రికార్డు. యాక్సెస్ నౌ నివేదిక ప్రకారం.. 2023 సంవత్సరంలో 39 దేశాలలో దాదాపు 283 ఇంటర్నెట్ షట్‌డౌన్‌లు జరిగాయి. దీనితో పోలిస్తే 2024 సంవత్సరంలో చా...