Hyderabad, మార్చి 28 -- International Childrens Drama Festival In Hyderabad: నాటకరంగంలో బాల బాలికల ప్రతిభను పెంపొందించేందుకు తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ సహకారంతో.. ప్రముఖ నటనా శిక్షణ సంస్థ "నిశుంబితా స్కూల్ ఆఫ్ డ్రామా" హైదరాబాద్‌‌లో మొట్ట మొదటిసారిగా అంతర్జాతీయ బాలల నాటక ఉత్సవాన్ని నిర్వహించనుంది.

ఈ కార్యక్రమంలో కోల్‌కతా, భోపాల్, కేరళ ప్రాంతాల నుంచే కాకుండా నేపాల్, జపాన్ తదితర దేశాల్లోని కళాకారులు, నాటక బృందాలు సైతం పాల్గొంటున్నాయి. రవీంద్రభారతి ఆడిటోరియంలో ఏప్రిల్ 7 నుంచి 9 వరకూ ఈ కార్యక్రమం జరగనుంది. ఈ ఈవెంట్‌లో థియేటర్, స్టోరీ టెల్లింగ్, నాటక ప్రదర్శనలతో చిన్నారులను అలరించే ఓ అద్భుతమైన వేదికను అందించేందుకు నిర్వాహకులు సంసిద్ధమయ్యారు.

కొత్తతరం కళాకారుల్లో సృజనాత్మకత, సాంస్కృతిక విలువలను పెంపొందించే ఈ వేదికపై వీక్షకులను మంత్రముగ్ధులను...