Hyderabad, ఏప్రిల్ 4 -- రోజూ క్యారెట్ తింటే మంచిదని నిపుణులు పెద్దలు చెబుతుంటారు. అంతర్జాతీయ క్యారెట్ దినోత్సవం సందర్బంగా ఇలా ఎందుకంటారు? డైలీ డైట్లో క్యారెట్ చేర్చుకోవడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకుందాం రండి. క్యారెట్ అనేది శక్తివంతమైన, రుచికరమైన రూట్ వెజిటేబుల్. ఇందులో విటమిన్లు, పోషకాలు సమృద్ధిగా ఉంటయి. ఇది ఆరోగ్యానికి చేసే మేలు గురించి ప్రత్యేకంగా చెప్పుకునేందుకు ప్రపంచవ్యాపంగా ప్రతి ఏడాది ఏప్రిల్ 4న అంతర్జాతీయ క్యారెట్ దినోత్సవాన్ని జరుపుకుంటారు.

సాధారణంగా క్యారెట్లు నారింజ రంగులో ఉంటాయి. విటమిన్ K1, ఫైబర్, పొటాషియం, బీటా కెరోటిన్, యాంటీఆక్సిడెంట్లకు ఇవి గొప్ప మూలం. తక్కువ మొత్తంలో జియాక్సంతిన్, γ-కెరోటిన్, లుటీన్, α-కెరోటిన్, β-కెరోటిన్ ఉండటం వల్ల ఇవి విలక్షణమైన ప్రకాశవంతమైన నారింజ రంగును కలిగి ఉంటాయి.అయితే ప్రపంచవ్యాప్తంగా కొన్ని...