భారతదేశం, మార్చి 27 -- Interest Waiver: తెలంగాణలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఆస్తిపన్ను బకాయిల వడ్డీని 90శాతం మాఫీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వన్ టైమ్ సెటిల్మెంట్ స్కీమ్ (ఓటీఎస్)ను అమల్లోకి తెచ్చింది. 2024-25 ఆర్థిక సంవత్సరం వరకు మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలన్నీటిని ఒకేసారి చెల్లించిన వారికి 90 శాతం వడ్డీని మాఫీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇప్పటికే ఆస్తి పన్ను బకాయిలను వడ్డీతో సహా చెల్లించిన ఇంటి యజమానులకు వచ్చే ఏడాది ఆస్తిపన్నుల్లో 90 శాతం వడ్డీ మాఫీని వర్తింపజేస్తూ మిగిలిన పన్నులను వసూలు చేయాలని సూచించింది.

2024-25 ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరడంతో మున్సిపల్ అధికారులు ఆస్తిపన్ను వసూలుకై ప్రత్యేక చర్యలు చేపట్టారు. పన్ను బకాయి దారులకు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు రెడ్ నోటీసులు జారీ చేసి, ఆస...