భారతదేశం, ఏప్రిల్ 2 -- Inter Summer Holidays : తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఇంటర్ కాలేజీలకు వేసవి సెలవులను ప్రకటించింది. మార్చి 30, 2025 నుంచి జూన్ 1, 2025 వరకు వేసవి సెలవులు అని అధికారికంగా ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ సంస్థలతో సహా అన్ని ఇంటర్మీడియట్ కళాశాలలు ఈ షెడ్యూల్‌ను కచ్చితంగా పాటించాలని సూచించబడింది. తిరిగి కాలేజీలు జూన్ 2, 2025 పునః ప్రారంభమవుతాయని ఓ ప్రకటనలో వెల్లడించింది. వేసవి సెలవులను విద్యార్థులు తమ స్వీయ అధ్యయనం, నైపుణ్యాభివృద్ధి కోసం ఉపయోగించుకోవాలని బోర్డు కోరింది.

వేసవి సెలవుల్లో ఏవరైనా అనధికార తరగతులు నిర్వహిస్తున్నట్లు తేలితే ఆసంస్థలు బోర్డు మార్గదర్శకాల ప్రకారం కఠినమైన చర్యలను తీసుకుంటామని హెచ్చిరించింది. విద్యార్థులు, తల్లిదండ్రులు మరిన్ని వివరాల కోసం ఇంటర్ బోర్డు అధిక...